చైనా ప్ర‌తీకారం – భార‌తీయ కంపెనీల‌పై చైనా కీల‌క నిర్ణ‌యం

చైనా ప్ర‌తీకారం - భార‌తీయ కంపెనీల‌పై చైనా కీల‌క నిర్ణ‌యం

0
108

మ‌న దేశంలో దాదాపు 59 చైనా దేశానికి చెందిన కంపెనీ యాప్స్ నిషేధించింది మ‌న ప్ర‌భుత్వం.. దీంతో చాలా వ‌ర‌కూ ఆ యాప్స్ ఇక ఉండ‌వు అని చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఇక మొబైల్స్ లో ఆ యాప్స్ క‌నిపించ‌వు.

అయితే చైనా కూడా ఇప్పటికే భారత వెబ్ సైట్ లను సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇండియాకు చెందిన వెబ్ సైట్ లు చైనాలో కనిపించకుండా అక్కడి ప్రభుత్వం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వీపీఎన్ సర్వర్ల వ్యవస్థను నిలిపివేసింది.

ఇక భార‌త టీవీ ఛాన‌ళ్లు కూడా చూడ‌డం కుద‌ర‌ద‌ట‌..ఇలా చూడాలి అంటే ఐపీ టీవీ ఒక్కటే మార్గమని బీజింగ్ లోని భారత దౌత్య వర్గాలు చెబుతున్నాయి. ఇక్క‌డ ఇంట‌ర్ నెట్ లో కూడా ఇండియా ఛాన‌ల్స్ వెబ్ సైట్స్ క‌నిపించ‌కుండా నిలువ‌రిస్తోంది అని స‌మాచారం.