ఈ రోజుల్లో టిక్ టాక్ లేని మొబైల్ లేదు, అంతలా ప్రజలకు బాగా చేరువ అయింది, అయితే చాలా మంది యూజర్లు ఇది లేకపోతే ఉండలేము అనేవారు, అయితే ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ చేయడంతో చాలా మంది దిగులుగా ఉన్నా, సేమ్ అలాంటి యాప్ మన ఇండియన్ తయారు చేశాడు అని తెలిసి లక్షల్లో దానిని డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.
చింగారి యాప్ గంటలో లక్ష మంది డౌన్ లోడ్ చేసుకున్నారు, టిక్ టాక్ ఏకంగా 20 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు, అయితే చింగారీ కూడా త్వరలో మంచి పొజిషన్ కు వస్తుంది అంటున్నారు.
షార్ట్ వీడియో సర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్రస్తుతం భారతీయులు మక్కువ చూపిస్తున్నారు.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాషల్లో ఈయాప్ అందుబాటులో ఉంది. చాలా మంది నటులు దర్శకులు వ్యాపారవేత్తలు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందరికి తెలిసేలా చేస్తున్నారు..బెంగుళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్, సిద్ధార్థ్ గౌతమ్ గతేడాది చింగారి యాప్‌ను రూపొందించారు. ఇప్పుడు ఈ ఓనర్స్ పంట పండింది. చింగారి యాప్ దాదాపు పదిలక్ష మంది ఇప్పటి వరకూ డౌన్ లోడ్ చేసుకున్నారు.
మీరు కూడా మన భారతీయులు చేసిన ఈ యాప్ ను ఆదరించండి.డౌన్ లోడ్ చేయండి.