కన్న కూతురుని ఏ తండ్రి అయినా కంటికి రెప్పలా కాపాడుకుంటారు…. తమ కూతురికి ఎలాంటి కష్టం వచ్చినా ఆమెకు ఎలాంటి లోటు రాకుండా చూస్తాడు… అలాంటి ఒక తండ్రి కీచకుడిగా మారి కన్న కూతురుపైనే అత్యాచారం చేశాడు… ఈ దారుణం బెంగుళూరులో జరిగింది… 23వ తేది జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… హరలూర్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి తన కూతురికి జలుబు, దగ్గుతో బాధపడుతోంది.. అయితే ఆమెకు మందులకు బదులు నిద్ర మాత్రలు ఇచ్చాడు… ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు మరుసటి రోజు లేచి చూస్తే ఆమె పక్కన తన తండ్రి పడుకున్నాడు…
దీంతో తనపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించిన యువతి తన సవతి తల్లికి చెప్పింది…. అయితే ఆమె ఈ విషయం గురించి పట్టించుకోలేదు… దీంతో ఏం చేయాలో తేలిక టాయిలెట్ క్లీనర్ తాగి ఆతర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమెను వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించారు… కేసు నమోదు చేసుకుని యువతి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు..