చాలా మంది విద్యార్దులు పాస్ అవ్వకపోతే తమ జీవితం ఇక ఏమీ లేదు.. అంతా అయిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటారు, చాలా మంది టాప్ ర్యాంక్ రావాలి అని కలలు కంటారు.. అది రాకపోతే ఏకంగా ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు, అయితే తాజాగా ఓ విద్యార్దిని మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది పదోతరగతి. కాని ఆత్మహత్య చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో టెన్త్ బోర్డు ఫలితాల్లో ఒక విద్యార్థినికి 82 శాతం మార్కులు వచ్చినప్పటికీ ఆమె కలతచెంది ఆత్మహత్య చేసుకుంది. స్నేహితురాలికన్నా తనకు తక్కువ మార్కులు వచ్చాయని ఆ విద్యార్ధిని ఆందోళనకు లోనయ్యింది.
ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోవడానికి కారణం ఇది అని తేలింది, అయితే ముందు ఒకరిని చూసి ఒకరు పోల్చుకోవడం మానెయ్యాలని ఇదే మరణాలకు ఆత్మహత్యలకు కారణం అవుతోంది అంటున్నారు మానసిక వ్యాధి నిపుణులు, ఇలాంటి ఆలోచనలే వారికి ఈ నిర్ణయాలు తీసుకునేలా మదిలో వస్తాయని చెబుతున్నారు.