విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది… అభం శుభం తెలియని ఒక బాలికను ఎత్తుకెళ్లి రేప్ చేసి పారిపోయాడు…. బాలికకు తల్లిదండ్రులు చనిపోవడంతో తనకు జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోలేక తనలోనే మదనపడుతోంది… ఇక ఎలాగోలా విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చెపట్టారు…
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఏజెన్సీ ప్రాంతంలోని జీ మాడుగ మండలం కే కోడాపల్లి పంచాయితీ జన్నేర్రు గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలికపై బందవీధి గ్రామానికి చెందిన గొర్లె కుమార్ అనే యువకుడు కన్నేశాడు… అదును చూసుకుని బాలికను బలవంతంగా ఎత్తుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు…
ఇక ఆ బాలిక ఊహించని ఘటన చూసి షాక్ గురి అయింది… గట్టిగా కేకలు వేసింది.. దీంతో అక్కడనుంచి పారిపోయాడు దుండగుడు… తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకునేందుకు తల్లిదండ్రులు లేరు వారు గతంలోనే చనిపోయారు… దీంతో ఆ బాధను తనలోనే దాచుకుని రోజు మదనపడుతోంది… ఇటీవలే ఈ విషయం బంధువులు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు…