టిక్ టాక్ నిషేధంతో కంపెనీకి లాస్ ఎంతో తెలిస్తే మ‌తిపోతుంది

టిక్ టాక్ నిషేధంతో కంపెనీకి లాస్ ఎంతో తెలిస్తే మ‌తిపోతుంది

0
92

మ‌న ప్ర‌భుత్వం తాజాగా చైనా దేశానికి చెందిన 59 యాప్స్ ని నిషేధించింది.. ఈ విష‌యం పెను సంచ‌ల‌నం అయింది.. ఇందులో ప్ర‌ధానంగా టిక్ టాక్ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది, మ‌న దేశంలో దీనిని కోట్లాది మంది వాడుతున్నారు.

చైనా ప్రభుత్వానికి చెందిన ది గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం టిక్‌టాక్‌, హెలో మాతృ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్ 6 బిలియన్ డాలర్లు నష్టపోనుంది. అంటే సుమారు రూ.45,000 కోట్లు. తాజాగా లెక్క‌ల ప్రకారం ఈ కంపెనీకి ఈ మేర‌కు లాస్ వ‌స్తుంది అని చెబుతున్నాయి రిపోర్టులు, అయితే దీనికి ఎంత ఆదాయం వ‌చ్చినా చైనాకి దీని నుంచి కంపెనీ కొంత మేర ట్యాక్స్ క‌డుతుంది.

దీంతో ఇప్పుడు చైనాకి ఆ ట్యాక్స్ రూపంలో కూడా లాస్ వ‌స్తుంది, ప్రైవసీ, జాతీయ భద్రతకు ముప్పు ఉందన్న కారణంతో భారత ప్రభుత్వం ఈ యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే.అయితే దీనిపై న్యాయ పోరాటానికి వెళుతోంది టిక్ టాక్.