గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు వైద్యుల‌కి ఇచ్చే ఆహ‌రం ఇదే

గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు వైద్యుల‌కి ఇచ్చే ఆహ‌రం ఇదే

0
93

హైద‌రాబాద్ లో గాంధీ ఆస్ప‌త్రి చాలా మంది క‌రోనా రోగుల‌కి ఇది దేవాల‌యం అయింది, చాలా మంది డాక్ట‌ర్లు చేసిన సేవ‌కు ఆరోగ్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు పేషెంట్లు , ఇంటికి క్షేమంగా వెళ్లారు, మార్చి చివ‌రి వారం నుంచి ఇక్క‌డ వైద్యులు, సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేస్తున్నారు.
వారి సేవ‌లు వెల‌క‌ట్టలేనివి.

ఈ స‌మ‌యంలో వైద్యుల‌కి రోగుల‌కి కూడా పోష‌కాలు ఉన్న ఆహ‌రం ఇవ్వాలి.. అందుకే ప్ర‌భుత్వం వారికి మంచి ఆహారం ఇస్తోంది.. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం అందిస్తున్నారు. ఇక్క‌డ అంద‌రికి డిస్పోజ‌బుల్ ప్లేట్స్ లో ఆహారం అందిస్తున్నారు.

ఉదయం 7.30 – 8.00 గంటలకు ఇడ్లీ, పూరీ, బోండా, ఉప్మా, ఊతప్ప ఇస్తున్నారు
త‌ర్వాత గ్లాసు పాలు ఇస్తున్నారు
10 గంటలకు బిస్కెట్స్ తో పాటు టీ లేదా కాఫీ.

మధ్యాహ్నం ఒంటి గంటకు కూర, పప్పు, సాంబారు, పెరుగు, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్ తో భోజనం అందిస్తారు.. అలాగే సాయింత్రం 4 గంటలకు కాఫీ, ఖర్జూరం, అంజీర్, జీడిపప్పు, బాదం పప్పులు, టీ ఇస్తారు..వారికి పాలు కావాలంటే పాలు అందిస్తారు….రాత్రి 7.30 గంటలకు కూర, పప్పు, సాంబారు, పెరుగు, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్ తో భోజనం అందిస్తారు. వైద్యులు క‌రోనా రోగులు, న‌ర్సులు, పారిశుద్య సిబ్బందికి ఈ ఫుడ్ అందిస్తున్నారు.