తల్లి గోవా నుంచి వచ్చిందని కొడుకు దారుణమైన నిర్ణయం

0
116

అమ్మ అంటే తన కడుపు మాడ్చుకుని అయినా పిల్లలని అన్నం పెట్టి పోషిస్తుంది, కాని కొందరు మాత్రం వయసు వచ్చాక రెక్కలు విప్పుకుని డబ్బు సంపాదించాక ,తల్లి ప్రేమని మమకారాన్ని మరచిపోతారు, దారుణంగా ప్రవర్తిస్తారు.

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది, ఇటీవల తన తల్లి గోవా నుంచి వచ్చింది, అయితే ఆమెకి కరోనా టెస్ట్ చేస్తే పాజిటీవ్ వచ్చింది, దీంతో ఆ కొడుకు ఆమెని ఆస్పత్రికి తరలించకుండా ఏకంగా ఆమెని బస్టాప్ లో వదిలేశాడు, చివరకు అధికారులు గుర్తించి వివరాలు అడిగితే ఆమె తన కొడుకు చేసిన పని చెప్పింది.

తిరిగి గోవా వెళ్లిపోమని బస్టాండ్ లో ఆమెని వదిలేశాడు, చివరకు ఆమెని ఆస్పత్రికి తరలించారు అధికారులు…మాచర్ల బస్టాండ్లో వదిలేసి వెళ్లిపోయిన కొడుకుని పిలిచి ప్రశ్నించారు. తల్లి వల్ల కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్కు తరలిస్తారనే భయంతో ఇలా చేసినట్లు అతను పోలీసులకు చెప్పాడట.