ఏపీలోకరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూల్ జిల్లాలో కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి… ఈ మహమ్మారి ఇప్పుడు పట్టణాలనుంచి పల్లెలకు విస్తరించింది… దీంతో ప్రజలు భయాందోళకు గురి అవుతున్నారు..
తాజాగా అదే జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీలకు కరోనా సోకిట్లు వార్తలు వస్తున్నాయి… ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు వార్తలు వస్తున్నాయి ఇటీవలే ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా ఆ రిపోర్ట్ లో పాజిటివ్ అని తేలిందట…
అలాగే ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆయన భార్యకు కూడా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు… ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం… కాగా గతంలో కూడా ఇదే జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే…