మహిళల రక్షణకోసం ఎన్నో చట్టాలు వచ్చాయి కానీ వారికి మాత్రం రక్షణ కరువు అయింది… తాజాగా నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది… నవవధువుపై బంధువు ఒకరు లైంగికదాడి చేశాడు… ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… సుళ్లూరుపేట సమీపంలో ఒక గ్రామానికి చెందిన యువకుడికి మరో గ్రామానికి చెందిన యువతికి పెద్దల సమక్షంలో నాలుగు నెలల క్రితం వివాహం అయింది…
వీరు గ్రామంలో వేరే ఇంట్లో ఉంటున్నారు… అయితే ఈక్రమంలో భర్త వ్యవసాయాసాకి సంబంధించిన వస్తువుల కోసం పట్టణానికి వెళ్లాడు… దీంతో భార్య ఇంట్లో ఒంటరిగా ఉందని బంధువు ఒకరు గమనించారు… ఆమె ఇంట్లోకి వెళ్లి నాలుగు మాయమాటలు చెప్పి బలవంతంగా బెడ్ రూమ్ లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు…
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు… సాయంత్రం భర్త ఇంటికి రాగానే విషయం ఆయనకు చెప్పింది… దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు అతని ఫిర్యాదు మేరకు పోలీసుకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…