బ్రేకింగ్ — యాపిల్ కంపెనీ చైనాకి ఊహించని షాక్

బ్రేకింగ్ --- యాపిల్ కంపెనీ చైనాకి ఊహించని షాక్

0
114

చైనా కు భారత్ కు మధ్య ఇప్పుడు ఎలాంటి వివాదం నడుస్తుందో తెలిసిందే, గాల్వాన్ లోయలో జరిగిన ఘటన తర్వాత చైనా పై భారత్ సీరియస్ గా ఉంది, యుద్ద వాతావరణం నెలకొంది,ఈ సమయంలో చైనాకి చెందిన దాదాపు 59 యాప్స్ కూడా బ్యాన్ అయ్యాయి.

ఈ సమయంలో ఇతర దేశాలు కూడా చైనా కంపెనీలు యాప్స్ పై కాస్త ఫోకస్ పెట్టాయి, తాజాగా
ప్రపంచ దిగ్గజ ముబైల్ సంస్థ యాపిల్ చైనీస్ యాప్ స్టోర్లోని 4,500 ముబైల్ గేమ్స్ను తొలగించింది. దీంతో ఆ కంపెనీలకు వేల కోట్ల నష్టం రానుంది.

యాపిల్ యూజర్లకు ఇక ఆ యాప్స్ కనిపించవు..చైనా కంపెనీలు ఈ నిర్ణయంతో డైలమాలో పడ్డాయి.
గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా గేమ్స్ తొలగించాం. చట్టపరమైన అనుమతి లేకుండా చాలా గేమ్స్ యాప్లో ఉంచుతున్నారు. అందుకే కొత్త నిర్ణయాలు తీసుకున్నాము అని తెలిపారు, లైసెన్స్ నిబంధనలు ఫుల్ ఫిల్ చేస్తే మళ్లీ గేమ్స్ అప్ లోడ్ చేయవచ్చు అని తెలిపింది.