ఆన్‌లైన్‌లో నైటీ ఆర్డరు చేసింది చివ‌ర‌కు ఏం చేశారంటే

ఆన్‌లైన్‌లో నైటీ ఆర్డరు చేసింది చివ‌ర‌కు ఏం చేశారంటే

0
91

కొంద‌రు ఆన్ లైన్ లో ఆర్డ‌ర్ చేసిన వ‌స్తువులు రాకుండా వేరే వ‌స్తువులు వ‌స్తున్నాయి అని, వీటి ద్వారా మోస‌పోతున్నామ‌ని , డెలివ‌రీ అయ్యాక బ్యాక్ చేసుకోని కొన్ని సంస్ద‌లు ఉంటాయి, వీటి వ‌ల్ల చాలా న‌ష్ట‌పోతున్నాం అని అంటుంటారు క‌స్ట‌మ‌ర్లు, కొంద‌రు ఇలాగే బోల్తా కొట్టించే వారు ఉన్నారు, ఆన్ లైన్ పేరుతో మోసాలు చేసేవారు ఉన్నారు.

త‌మిళ‌నాడులో ఆన్‌లైన్‌లో ఆర్డరు చేసిన నైటీ రాకపోవడంతో చెల్లించిన సొమ్మును పొందే యత్నంలో ఓ మహిళ రూ.60 వేలను మోసపోయింది,ఓ నైటీ ఆమె ఆర్డ‌ర్ చేసింది, త‌న భ‌ర్త ఏటీఎం కార్డ్ ద్వారా ఆ న‌గ‌దు ఆన్ లైన్ లో 550 పే చేసింది.

పార్శిల్‌ రావడం ఆలస్యం కావడంతో ఆర్డర్‌ను కాన్సిల్‌ చేసి నగదును తిరిగి అందించాలని కస్టమ్‌ కేర్‌ అధికారి సదరు మహిళ కోరింది. ఇక బ్యాంకు ఖాతా నెంబ‌ర్ అడిగారు, వెంట‌నే ఏటీఎం కార్డ్ రెండు వైపుల స‌మాచారం ఇచ్చేసింది ఆమె వెంట‌నే ఓటీపీ చెప్ప‌మంటే ‌చెప్పేసింది ఇక వెంట‌నే 60 వేలు వాడిన‌ట్లు మెసేజ్ వ‌చ్చింది , చివ‌ర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది, ఆ క‌స్ట‌మ‌ర్ కేర్ నెంబ‌ర్ ఫేక్ అని తెలుస్తోంది, దీనిపై విచార‌ణ చేస్తున్నారు పోలీసులు.