ఈ కరోనా సమయంలో మాస్క్ లకి , శానిటైజర్లకు, గ్లౌజ్ లకి , ఫేస్ షీల్డ్ ఇలా అనేక వైద్య పరికరాలకి డిమాండ్ పెరిగింది… కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది …ఈ సమయంలో ఫేక్ వస్తువులు కూడా మార్కెట్లో కుప్పలు తెప్పలుగా వచ్చాయి, నాశిరకం శానిటైజర్లు కూడా తయారు చేశారు కొందరు కల్తీగాళ్లు.
తాజాగా హరిద్వార్ ప్లాంట్‌లో ఎటువంటి లైసెన్స్ లేకుండానే ఏకంగా ఏడు లక్షల శానిటైజర్‌ను తయారు చేశారు. ఇప్పటికే అతను ఏకంగా ఆరు లక్షల లీటర్ల శానిటైజర్ అమ్మేశాడు, ఈ బ్యూటీ ప్రొడక్ట్ కంపెనీకి చెందిన హరిద్వార్ ప్లాంట్ శానిటైజర్ తయారు చేసేందుకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. కాని ఇంకా లైసెన్స్ రాలేదు అయినా అమ్మకాలు చేసింది.
దీనిపై తాజాగా పోలీసులకు సమాచారం వచ్చింది…అక్కడ ఉన్న లక్ష లీటర్ల శానిటైజర్‌ను స్వాధీనం చేసుకోవడంతోపాటు, ప్లాంట్ నిర్వాహకులను అరెస్టు చేశారు. , స్ధానికులు చెప్పడంతో ఎక్సైజ్‌శాఖ బృందం ఈ కంపెనీపై దాడి చేసింది. క్వాలిటీ లేని శానిటైజర్ వాడద్దు అంటున్నారు పోలీసులు సిబ్బంది వైద్యులు.