ఖైదీల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

ఖైదీల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

0
104

దేశంలో కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతోంది, ఈ స‌మ‌యంలో న‌లుగురు గుంపుగా ఉండ‌కూడ‌దు అని ప్ర‌భుత్వం కూడా చెబుతోంది, భౌతిక దూరం పాటిస్తూ ఎవ‌రి ప‌ని వారు చేసుకోవాలి అని చెబుతున్నారు, అయితే చాలా వ‌ర‌కూ ఇప్పుడు ఒక‌టే చ‌ర్చ జ‌రుగుతోంది, దీనికి ఎప్పుడు ఎండింగ్ అని. అయితే వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కూ ఈ ఇబ్బంది త‌ప్ప‌దు అంటున్నారు.

ఏపీలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో ఖైదీలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు 13 జిల్లాల్లో స్పెషల్ సబ్ జైళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాజాగా దీనిపై ఉత్త‌ర్వులు జారీ చేసింది… ఇక నేరస్తులు అందరినీ ఇకపై కోర్టు ఆదేశాల అనంతరం స్పెషల్ జైలుకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ సబ్ జైళ్లలో కరోనా పరీక్షలు, ఇతర శానిటైజేషన్ ప్రోటోకాల్‌ను పాటించాలని స్పష్టంచేసింది. ఇక ఒక‌వేళ ఎవ‌రికి అయినా నెగిటీవ్ వ‌స్తే సాధార‌ణ జైలుకి పంపుతారు, పాజిటీవ్ వ‌స్తే వారిని కోవిడ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించాలి అని తెలిపారు.