ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వరకూ కరెంట్ బిల్లులు లక్షల రూపాయలు వచ్చాయని, మాకు 500 మించి రాదు అని అసలు 250 నుంచి 1000 రూపాయలు బిల్లు రాని వారికి, ఏకంగా 12 లక్షలు 20 కోట్లు బిల్లులు రావడం ఏమిటి అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన యంత్రాలు ఒక్కోసారి తప్పు చేస్తాయి, ఇది అలాంటిదే టెక్నికల్ ఎర్రర్ సమస్యల వల్ల ఇలా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది, లక్షల కరెంట్ మీటర్లు ఉంటే ఒకటో రెండో ఇలాంటివి వస్తాయి.
అయితే ఎవరికి అయినా ఇలా అసలు ఊహించని విధంగా లక్షలు కోట్లు కరెంట్ బిల్లు వచ్చిన సమయంలో, మీకు బిల్లు రీడింగ్ తీసిన రోజు వెంటనే మీరు స్ధానిక కరెంట్ ఆఫీసుకి వెళ్లాలి, ఆ బిల్లు రీడింగ్ పేపర్ మీరు జిరాక్స్ ఓరిజనల్ తీసుకుని వెళ్లండి, వీలైతే ఆ ఇళ్లు కరెంట్ మీటర్ ఎవరిపేరుమీద ఉందో వారు వెళ్లండి, అద్దె ఇళ్లు అయితే ఓనర్ ను తీసుకువెళ్లండి, ఇలా అక్కడ కరెంట్ ఆఫీస్ అధికారితో చర్చించండి.. 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది, తొందర ఆవేశం పడవద్దు, ఆ మీటర్ సమస్య పరిష్కరించి మీకు కొత్త బిల్లు ఇస్తాము అని చెబుతున్నారు అధికారులు.