మనకు ఉన్న దానిలో ఎంతో కొంత సాయం చేసి, నిరుపేదలకు లేనివారికి చేయూత అందివ్వాలి అని అంటారు , ఇలా సాయం చేసేవారు చాలా మంది ఉంటారు.. పేరు కోసం గొప్ప కోసం తాపత్రయం ఉండదు.. పిలిచి లేనివారికి సాయం అందించే మహానుభావులు చాలా మంది ఉన్నారు.
అయితే ఓ 80 ఏళ్ల వయసున్న ఆ వృద్ధదంపతులు. వారి సొంత భూమిలోనే పేదల కోసం ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. కేరళ త్రిస్సూర్ కు చెందిన కోరట్టి వర్గీస్, అతని భార్య ఫిలోమెనాలు ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు, అయితే ఇందులో పేదల కోసం ఇళ్లు కట్టించి వారే ఇవ్వనున్నారు.
అంతేకాదు దీని కోసం ఎవరిని విరాళాలు కూడా అడగటం లేదు,వర్గీస్ సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు. భార్య ఫిలోమెనా ఉపాధ్యాయురాలిగా పని చేసి పదవీ విరమణ పొందారు. తాము చిన్నతనంలో పేదరికం చూశాం మాకు సాయం చేసే స్దోమత ఇప్పుడు ఉంది అందుకే పేదలకు సాయం చేస్తున్నాం అంటున్నారు.
ఇద్దరూ..
ఇక వారు రిటైర్ అయ్యాక కలప వ్యాపారం ప్రారంభించారు. ఐదు పేద కుటుంబాలకు ప్రస్తుతం వారు ఇళ్లను నిర్మిస్తున్నారు. వాటితో పాటే ఒక వృద్ధాశ్రమాన్నికడతాము అంటున్నారు అంతా వారి సొంత నగదుతోనే రియల్లీ గ్రేట్ కదా.