మనం కాకరపాదులు చూస్తాం, దానిని చూడగానే అమ్మో చేదు అంటాం, కాని చేదుగా ఉండే దానిలోనే అనేక లాభాలు ఉంటాయి, శరీరానికి పలు వ్యాధులు రాకుండా చేస్తుంది కాకరకాయ, ముఖ్యంగా సీజనల్ వ్యాధులు, దగ్గు జలుబు ఫ్లూ రాకుండా చేస్తుంది.
చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నా తగ్గుతాయి, పుండ్లు లాంటివి ఉన్నా అవి తగ్గుముఖం పడతాయి, ఇక కాకరకాయ జ్యూస్ తీసుకున్నా చాలా మంచిది లేదా అన్నంతో కూరగా తీసుకున్నా మంచిదే అంటున్నారు నిపుణులు.
వర్షాకాలంలో జలుబూ, దగ్గు బారినపడకుండా ఉండాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే కాకరకాయను తినాల్సిందే, ఇక ఇందులో పీచు ఎక్కువ ఉంటుంది.. అందుకే సులువుగా జీర్ణం అవుతుంది మలబద్దకం కూడా ఉండదు, చెడు బ్యాక్టిరీయా అంతా బయటకు పోతుంది, ఇక చాలా మంది బాణ పొట్ట ఉంది అని బాధపడతారు, వారు కాకరకాయ జ్యూస్ తీసుకోండి.దీని వల్ల పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది…విటమిన్-సి, ఎ, ఫొలెట్, పొటాషియం, జింక్, ఇనుము నిండుగా ఉంటాయి. షుగర్ సమస్య ఉన్నవారు కూడా కాకరకాయ తీసుకుంటే మంచిది.