తన గ్యాంగ్ ని చూసుకుని రెచ్చిపోయాడు, పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపాడు.. ఎనిమిది మంది పోలీసులని చంపాడు, ఇలాంటి దుర్మార్గుడు చచ్చినా పర్వాలేదు అని అందరూ కోరుకున్నారు, చివరకు తన అనుచరులని పోలీసులు ఏరివేస్తున్నారు అని తెలిసి హడలిపోయాడు.
నేరుగా పోలీసులకి లొంగిపోయాడు ఈ నేరగాడు వికాస్ దూబే. వాహనంలో తుపాకీ లాక్కునేందుకు జరిగిన పెనుగులాటతో కారు బోల్తా పడిందని చెప్పారు పోలీసులు. మధ్యప్రదేశ్‌లో పట్టుబడిన దూబేను పోలీసులు కాన్పూర్ తరలించేందుకు 13 వాహనాలను ఏర్పాటు చేశారు ఈ సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
దాదాపు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణంలో 690 కిలోమీటర్ల దూరం సజావుగానే సాగింది. తుపాకీ తీసుకుని పారిపోయేందుకు చూశాడు ఈ సమయంలో వాహనం అదుపు తప్పింది. ఎన్నో హత్యలు చేశాడు నేరాలు చేశాడు, అరవై కేసుల్లో ముద్దాయి, ఎమ్మెల్యేని కూడా చంపిన కేసు అతనిపై ఉంది.