ఏ కూరల్లో చూసినా ఉల్లిలేనిదే కూర పూర్తి అవ్వదు, అందుకే ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు …ఉల్లి ఘాటుగా ఉన్నా వాసన వచ్చినా అది కూరకే రుచి తెస్తుంది, ఉల్లి లేని ఇళ్లు ఉండదు, అయితే ఉల్లి ఏ వయసు వారు అయినా తీసుకోవచ్చు.
ఆరోగ్యానికి ఇది చాలా మంచిది, ఇది తీసుకోవడం వల్ల మీ శరీరంలో రక్తం గడ్డలు ఉంటే అవి కరుగుతాయి, గుండె నొప్పులు రక్తనాళాల సమస్యలు తగ్గుతాయి, తలనొప్పి లాంటి సమస్యలు ఉన్నా వారు కూడా పచ్చి ఉల్లిపాయ పెరుగులో తింటే ప్రయోజనం ఉంటుంది.
కొలస్ట్రాల్ సమస్యను అదుపులో ఉంచి ట్రైగిజరాయిడ్స్ పెరగకుండా చేస్తుంది. ఇక అధికంగా కాకపోయినా రోజూ ఉల్లి తీసుకుంటే ఎంతో మేలు ఉంటుంది, ఇక ఉల్లి ఉడకబెట్టి కూరల్లో వాడితే చాలా మంచిది, డీప్ ఫ్రై లాంటి ఉల్లి వంటల కంటే ఉడకబెట్టి పచ్చడి చేసిన ఉల్లి ఎంతో టేస్ట్ ఆరోగ్యకరం.. ఇక మహిళల్లో అండాశయ క్యాన్సర్ కూడా అదుపులో ఉంటుంది, ఇన్ ఫెక్షన్ చీము అలాంటివి తగ్గుతాయి.