గ్యాంగ్‌స్టర్ లు కోట్ల రూపాయలు సంపాదిస్తారు, ఎవరో ఒకరి పేరుమీద వాటిని రిజిస్టర్ చేయిస్తారు.. నగదు అవసరం ఉన్న సమయంలో వారిపేరు మీద అమ్మేసి ఆ నగదు తెచ్చుకుంటారు, ఇలా ఎందరో తమ జీవితంలో కోట్ల రూపాయలు సంపాదించారు, బినామీల పేరుతో వందల కోట్లు పక్కన పెట్టారు.
అయితే తాజాగా కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే గురించి కూడా చర్చ జరుగుతోంది, అతను కూడా చాలా దారుణాలు చేశాడు, అతడి ఆస్తుల చిట్టాపై పోలీసులు, ఐటీ అధికారులు ఆరా తీశారు. అతి తక్కువ కాలంలోనే కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించాడని తేలింది.
అతని బినామీలు, స్థిరాస్తులపై దృష్టిసారించారు పోలీసులు. కుటుంబసభ్యులు, బంధువుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను సేకరించారు. ఇలా కుటుంబ సభ్యులు దూరపు బంధువుల పేర్లమీద ఆస్తులు బాగా దాచాడు అని తేలింది, లక్నోలో రూ. 5 కోట్లతో ఓ విలాసవంతమైన భవనం కొన్నాడు, అది కూడా గత ఏడాదిలో అని తేలింది… 12 ఇళ్లు, 21 ఫ్లాట్లు బినామీల పేరుమీద రిజిస్టర్ చేయించాడు.
అతని సొంత ప్రాంతంమైన పంకీ ప్రాంతంలో రూ. 2 కోట్ల విలువైన డూప్లెక్స్ బంగళా ఉంది. ఆర్యనగర్‌లో 28 కోట్ల బినామీ ఆస్తులున్నాయనే సమాచారం అందింది. ఇక పలు అపార్ట్ మెంట్లు రెంటెడ్ కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి, అలాగే దుబాయ్ లో కూడా పలు ఆస్తులు ఉన్నాయి.బ్యాంకాంక్‌లోని ఓ హోటల్ పెట్టుబడులు కూడా ఉన్నాయని తేలింది, వీటిపై పూర్తిగా విచారణ చేస్తున్నారు పోలీసులు.