హీరో వెంకటేష్ మంచి కధలు వస్తే వదిలిపెట్టరు.. సమయం తీసుకుని అయినా కచ్చితంగా ఈ సినిమా చేస్తాను అని చెబుతారు దర్శకులకి …ఈ మధ్య వెంకీ స్పీడ్ పెంచారు..ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా చేస్తున్నాడు. అసురన్ మూవీకి రీమేక్ గా చేస్తున్నారు.
ఇక తర్వాత అనిల్ రావిపూడితో ఎఫ్ 3మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఇలా బిజీ బిజీగా ఉన్నాడు వెంకీ, అలాగే మలయాళంలో హిట్టైన అయ్యప్పన్ కోషియమ్ సినిమాను రానాతో కలిసి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
ఇలా ఫుల్ బిజీగా ఉన్నారు వెంకీ, తాజాగా దృశ్యం సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు సూపర్ స్టార్… ఈ సినిమా హిట్ అయితే ఇది తెలుగులో వెంకీ చేయాలి అని చూస్తున్నారట, ఇక అక్కడ హిట్ అయితే మరోసారి ఈ సినిమా వెంకటేష్ చేయనున్నారట.