కట్నం కోసం పాతనోట్లు సిద్దం చేశారు చివరకు ఏమైదంటే

కట్నం కోసం పాతనోట్లు సిద్దం చేశారు చివరకు ఏమైదంటే

0
92

ఇప్పటికీ చాలా మంది పేదలకు, ,చదువుకి దూరంగా ఉన్న వారికి కరెన్సీ గురించి పెద్దగా తెలియదు, ఏకంగా మన దేశంలో పెద్ద నోట్లు రద్దు అయిన విషయం తెలిసిందే, అయితే చాలా మంది కొత్త నోట్లను వాడుతున్నారు.

ఇలా దేశం అంతా చెలామణీ అయింది, ఇక ఓ ముసలవ్వ పాపం, పాత నోట్లు రద్దు అయిన విషయం తెలియక నగదు దాచింది, అదంతా తన కూతురు పెళ్లి కోసం కూడబెట్టింది.నాగపట్టణం జిల్లా శీర్గాళి సమీపానికి చెందిన ఆమె దివ్యాంగురాలు. ఉపాధి హామీ పనులకు వెళ్తూ తన కుమార్తె వివాహం కోసం డబ్బులు పొదుపు చేసింది.

ఇంటి వెనుక ప్రాంతంలో గుంత తవ్వి అందులో రూ.500, రూ.1,000 నోట్లను ఉంచింది. అయితే ఈ మధ్య ఇంటి పని కోసం గోయి తవ్వారు, అక్కడ గుంతలో చూస్తే ఈ నగదు ఉంది, అయితే కట్నం కోసం ఆమె ఈ నగదు దాచింది, అయ్యో ఇవి రద్దు అయినాలుగు సంవత్సరాలు అయింది అని తెలిపారు జనం.. దీంతో ఆమె కన్నీరు మున్నీరు అవుతోంది, ప్రభుత్వం ఆమెకి ఈ నగదు మార్చి, కొత్త కరెన్సీ ఇవ్వాలి అని కోరుతున్నారు అక్కడ జనం.