మెగా డాటర్ ఆ డైరెక్టర్ తో సినిమా….

మెగా డాటర్ ఆ డైరెక్టర్ తో సినిమా....

0
76

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె తన భర్త విష్ణుతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే… ఇప్పటికే మెగా డాటర్ సుష్మిత ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా తన తండ్రి చిరంజీవికి కాస్టూమ్ డిజైనర్ గా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకుంది…

ఇటీవల పూజా కార్యక్రమంతో మెగాస్టార్ సతీమణి సురేఖ చేతులు మీదుగా ప్రారంభించారు… ఇదిఇలా ఉంటే మొదటగా ఓ వెబ్ సిరీస్ ద్వారా ఈ ప్రొడక్షన్ హౌస్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతోందట సుష్మిత…

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఎక్కువ ప్రయారిటీ ఉన్న నేపథ్యంలో సుష్మిత ఈ రంగంలోకి దిగాలని చూస్తుందట… మెగా అభిమానులు కూడా ఈ రంగంలో సుష్మిత సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు… ఈ వెబ్ సిరీస్ కు ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…