ఏపీ స్పీకర్ గా రాజ్యంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీ తరపున కీలక భూమిక పోషించే తమ్మినేని దూకుడు ఇప్పుడు ఆయనకు కలిసొస్తుంది… మంత్రి కావాలనుకుని ప్రస్తుతం స్పీకర్ గా కొనసాగుతున్న ఆయనను స్పీకర్ పదవి నుంచి తప్పించి మంత్రిగా సీఎం జగన్ అవకాశం ఇస్తారా స్పకర్ గా కంటే మంత్రిగా ఆయనకు అవకాశం ఇస్తే ఆయన మరింత దూకుడు చూపించే వీలు ఉంటుందని అది పార్టీకి కలిసొస్తుందని సీఎం జగన్ భావిస్తున్నారా అనే చర్చ ఇప్పుడు శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో వినపడుతోంది…
తమ్మినేని సీతారాం ఇప్పటి వరకు అమాత్యా అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతుండటంతో కొత్తగా మంత్రి వర్గంలో అవకాశం కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే…వారిలో స్పీకర్ తమ్మినేని శీతారాం కూడా ఉన్నారని సమాచారం… తమ్మినేని సీతారాం సహజంగా దూకుడు ఉన్న వ్యక్తి ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పగలిగిన వ్యక్తి స్పీకర్ హోదాలో కొనసాగుతున్న ఆయన దూకుడు ప్రతిపక్ష పార్టీలకు ఆస్త్రాలుగా మారుతున్నాయి…
ఈ నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని ఆలోచన సీఎం జగన్ మదిలో కూడా ఉన్నట్లు సమాచారం… అంతేకాదు ప్రతిదానికి బీసీ కార్డు వాడుతున్న టీడీపీకి అదే స్థాయిలో భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది… ప్రభుత్వానికి అనుకూలంగా అన్ని విషయాలలో గట్టిగా మాట్లాడగలిగిన వారు కాబట్టి తమ్మినేని తనకు మంత్రి బెర్త్ ఖరారు చేయాలని సీఎం జగన్ ను కోరుతున్నట్లు సమాచారం…. ఈ మధ్య కాలంలో జగన్ ని కలిసిన తమ్మినేనికి మంత్రి పదవి విషయంలో ఓ స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఇటీవలకాలంలో ఆయన ప్రముఖ దేవాలయంను సందర్శించినట్లు సమాచారం…