ఈ లాక్ డౌన్ వేళ పేదలు ఉపాధి లేక డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా కేంద్రం కూడా పేదలకు ఉచిత రేషన్ అందిస్తోంది, అయితే స్టేట్ గవర్నమెంట్ లు కూడా ఉచిత రేషన్ అలాగే నగదు సాయం కూడా చేస్తున్నారు, ఈ సమయంలో కేంద్రం గ్యాస్ కూడా ఉచితంగా అందిస్తోంది, అయితే అందరికి కాదు, కేవలం ఉజ్వల స్కీమ్ లబ్దిదారులకు మాత్రమే..
మరి అసలు ఎవరు ఈ ఉజ్వల స్కీమ్ వారు అనేది చూద్దాం, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద బీపీఎల్ కుటుంబంలోని మహిళలు గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. pmujjwalayojana.com వెబ్సైట్ ద్వారా స్కీమ్ వివరాలు ఉంటాయి, ఇందులో అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది.
పేదల కోసం ప్రధాని మోదీ 2016 మే 1న ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఇది మీకు దగ్గర్లో ఉన్న ఎల్ పీజీ డిస్ట్రిబ్యూటర్కి అందించాలి, మీరు ఇచ్చిన అప్లికేషన్ కి జన్ ధన్ అకౌంట్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ అన్నీ జిరాక్స్ లు ఇవ్వాలి.తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అర్హులైన వారికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి అనుమతినిస్తాయి.గ్యాస్ కనెక్షన్కు రూ.3,200 అవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1600 సబ్సిడీ అందిస్తుంది. ఇక మిగిలిన రూ.1600 ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు భరిస్తాయి. ఇలా ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు.