కొందరు ఉద్యోగులు కంపెనీలను ఎక్కడికో తీసుకువెళతారు…మరికొందరు మాత్రం దారుణమైన పాతాళంలోకి తీసుకువెళతారు, అందుకే మంచి స్టాఫ్ ఉంటే కంపెనీలు ఎక్కడో ఉంటాయి, మరికొందరి వల్ల కంపెనీలు నాశనం అవుతాయి, దీనిని గుర్తించిన బాస్ మాత్రమే మంచి లాభాలు సంపాదించి ఉన్నత స్ధితికి చేరతాడు అంటారు.
అయితే అమెజాన్ కంపెనీ తెలిసిందే …ప్రపంచ ధనవంతుడిలో అమెజాన్ అధినేత ముందు ఉంటారు, అయితే ఈ కంపెనీలో లక్షలాది మంది ఉద్యోగం చేస్తున్నారు, తాజాగా ఓ ఉద్యోగి చేసిన పనికి సంస్ధకు భారీగా నష్టం వచ్చింది.
కంపెనీపై ఆగ్రహానికి లోనైన స్టీవెన్ కోహెన్ అనే ఉద్యోగి కారుతో అమెజాన్ కేంద్రంలోకి దూసుకెళ్లాడు. దీంతో భవనం ముందువైపు ఉన్న తలుపులు ధ్వంసమయ్యాయి. అక్కడితో ఆగని సదరు ఉద్యోగి కారును భనవం వెనుక వైపునకు తీసుకెళ్లి అక్కడ ఇదే తరహాలో అరాచకం చేశాడు, దీంతో అందరూ షాక్ అయ్యారు, సుమారు సంస్ధకు దీని వల్ల 60 వేల డాలర్ల నష్టం జరిగింది .. కొలరాడో రాష్ట్రంలోని ఆఫీస్ దగ్గర ఇది జరిగింది, అయితే అతని ఆగ్రహానికి కారణం ఏమిటో ఇంకా విచారణ చేస్తున్నారు పోలీసులు.