గసగసాలు చూడగానే తెల్లగా ఉంటాయి, అంతేకాదు కమ్మటి వాసన వస్తాయి, వీటిని ఉత్తిగా కూడా తింటారు, అయితే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే మషాలా కూరల్లో కూడా గసగసాలు బాగా వాడతారు, గసగసాలు నూరి వాటిని కూరలలో వేస్తారు.
వేడి శరీరంగల వారికి ఎంతో మంచిది.. అతిసారం, నీళ్ళ విరేచనాలకు, తలలోని చుండ్రు నివారణ, నిద్రలేమి సమమస్యలకు చక్కటి పరిష్కారం గసగసాలు. ఇక పటికి బెల్లం గసగసాలు కలిపి తీసుకుంటే కడుపులో వేడి తగ్గుతుంది.
బాడీకి చలువ చేస్తుంది, గసగసాలు తీసుకోవడం వల్ల మెదడుకు బలం, పిల్లల్లో చురుకుదనం పెంపొందిస్తుంది. గసగసాలను నీటిలో నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు పట్టించి ఓ గంట తరువాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తుంటే తలలోని కురుపులు, చుండ్రు తగ్గిపోయి వెంట్రుకలు ఆరోగ్యంగా మెరుగవుతాయి, ఇవి తలకి కూడా చాలా మంచిది, ఇలా గసగసాలు మీరు వంటల్లో వాడుకోవచ్చు.