బంగారం ధర మళ్లీ రెండు రోజులుగా పెరిగింది, అయితే తాజాగా మళ్లీ బంగారం ధరలు తగ్గాయి, దీంతో మార్కెట్లో బంగారం కొనాలి అని చూసేవారికి ఇది సరైన సమయం అని చెప్పాలి, ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 తగ్గింది. దీంతో ధర రూ.51,170కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.46,910కు చేరింది, బంగారం గడిచిన వారంగా మళ్లీ పెరిగినా రెండు రోజులుగా తగ్గింది, నేడు స్వల్పంగా తగ్గింది గోల్డ్ రేట్.
పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.90 దిగొచ్చింది. దీంతో ధర రూ.52,120కు తగ్గింది. ఇక శ్రావణం సేల్ వరకూ బంగారం ఇలా ఒడి దుడుకులు ఉంటుంంది అంటున్నారు, తర్వాత కాస్త బంగారం ధర పెరగచ్చు అంటున్నారు. అయినా 51 వేల మార్క్ దాటేసింది బంగారం.