ఈ కరోనా మహమ్మారి ఎవరిని విడిచిపెట్టడం లేదు, అయితే ఇమ్యునిటీ పవర్ బాగుండి ఉంటే వారు కరోనా వచ్చినా శరీరం రోగనిరోధక శక్తి బలంగా ఉండటంతో వెంటనే క్యూర్ అవుతున్నారు, మరేమైనా అనారోగ్య సంబంధ వ్యాదులు ఉంటే కాస్త కోలుకోవడానికి సమయం పడుతోంది, అయితే తాజాగా చిన్నపిల్లలకు కూడా కరోనా సోకుతోంది.
ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వైరస్ సోకుతోంది, అందుకే బయట పనులకి వెళ్లినా ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకి తాకకండి అంటున్నారు వైద్యులు, స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు వాష్ చేసి శానిటైజర్ వాడి మాస్క్ ధరించి ముట్టుకోవడం మంచిది అంటున్నారు.
ఇక పిల్లల్లో ముందుగా దగ్గు జలుబు ప్రాధమికంగా గుర్తిస్తున్నారు, అయితే వికారం వాంతులు కూడా వస్తున్నాయి ఇలా రెండోరోజు విరోచనాలు కూడా కొందరికి వస్తున్నాయి, అయితే సాధారణ ట్యాబ్లెట్స్ వేసుకున్నా రెండు రోజులకి కూడా తగ్గకపోతే వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లాలి అంటున్నారు, ఇక వారు రుచి వాసన కోల్పోయినా వెంటనే అశ్రద్ద చేయద్దు.