ఈ కరోనా వైరస్ తో పూర్తిగా లాక్ డౌన్ ఏర్పడింది, దీంతో చాలా మంది సొంత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు, ఇక ముఖ్యంగా భాగ్యనగరంలో నాలుగు నెలలుగా ఇళ్లు ఖాళీగా ఉంచి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు, ఉద్యోగాలు లేకపోవడంతో అద్దె కట్టలేని స్దితి, దీంతో ఇళ్లు చాలా వరకూ ఖాళీ చేస్తున్నారు.
అలాగే కొందరు ఓనర్లు అయితే అద్దె కూడా తగ్గిస్తున్నారు.. దీంతో 15 వేల ఇంటి అద్దెలు ఒక్కసారిగా 10వ వేలకు తగ్గాయి, అందుకే చాలా మంది మరో ఇంటికి మారిపోతున్న వారు ఉన్నారు, దీంతో ఇలా కొన్ని వేల మంది ఇళ్లు మారారు, ఈ సమయంలో పాకర్స్ మూవర్స్ చేసే వ్యాపారం ఆ కంపెనీలుకు ఫుల్ మార్కెట్ ఉంది.
ఇక చాలా మంది నగరంలో వీటినిఆశ్రయిస్తున్నారట, ఈ లాక్ డౌన్ వేళ మరెవరినో తీసుకునే బదులు ఇలా మూవర్స్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారు, ఇప్పుడు ఈ వ్యాపారానికి డిమాండ్ నగరంలో బాగా పెరిగింది అంటున్నారు నిపుణులు.