ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన అమెజాన్ ఖుషీ ఖుషీ

ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన అమెజాన్ ఖుషీ ఖుషీ

0
85

ఈ కరోనా వైరస్ తో పూర్తిగా లాక్ డౌన్ లోనే ఉన్నాయి చాలా ప్రాంతాలు, ముఖ్యంగా అన్నీ దేశాల్లో ఇదే పరిస్దితి ఈ సమయంలో కంపెనీలకు వచ్చి ఉద్యోగాలు చేయడం చాలా మందికి ఇబ్బందిగా కష్టంగా మారుతోంది, ఈ సమయంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కు అనుమతులు ఇస్తున్నాయి.

ఇక పెద్ద పెద్ద సంస్ధలు ఏకంగా ఈ ఏడాది డిసెంబర్ వరకూ ఇంటి నుంచి ఉద్యోగులు వర్క్ చేయాలి అని తెలిపాయి, వారికి కావలసిన నెట్ బిల్, టేబుల్ ఏర్పాటుకి, సిస్టం ఏర్పాటుకి బిల్స్ పెడితే నగదు ఇవ్వడం జరిగింది.

ఈ సమయంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు శుభవార్త అందజేసింది. కరోనా తీవ్రత తగ్గేవరకు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయవచ్చని ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 8 వరకు వర్క్ ఫ్రం హోం చేయవచ్చని తెలిపింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థలైన గూగుల్, ఫేస్బుక్, యాపిల్ తమ ఉద్యోగులు ఈ ఏడాది చివరి వరకు ఇంటి నుంచి పనిచేయవచ్చని ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా అమెజాన్ కూడా ఇలా చెప్పడంతో ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారు. అమెజాన్ సంస్థలో 8.4 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.