ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది… ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… హైదరాబాద్ ఫిర్జాదిగూడకు చెన్నారెడ్డి ఎన్ క్లేవ్ కు చెందిన శ్రావణి స్థానికంగా ఉన్న ఒక షాపింగ్ మాల్ లో పని చేస్తోంది… జనగామ జిల్లాకు చెందిన గోల్కొండ గ్రామానికి చెందిన అజయ్ కొద్దికాలంగా ఉప్పల్ లోని ఒక వెహికల్ షోరూంలో పని చేస్తున్నారు…
కొద్ది రోజుల క్రితం వీరిద్దరికి పరిచయం ఏర్పడింది… ఈ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది… రెండేళ్లుగా వీరు ప్రేమించుకున్నారు… ఈ క్రమంలో వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు… అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు.. కానీ అబ్బాయితరపు పేరెంట్స్ ఒప్పుకోలేదు…
దీంతో వారు ఒక హోటల్ లో కలిసి పురుగుల మందు తాగారు ఇక అది గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు… అప్పటికే శ్రావణి మృతి చెందింది… అజయ్ ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమాద్యమంలో మృతిచెందారు…