మూవీ మొగల్ రామానాయుడు బతికున్నప్పుడు చాలా సందర్భంలో మెగాస్టార్ చిరంజీవితో సురేష్ ప్రొడక్షన్స్ లో సినిమా చేయాలని ఉందని తెలిపారు.చిరంజీవి కూడా సురేష్ ప్రొడక్షన్లో చేయడాన్ని గౌరవంగా భావిస్తానని తెలిపిన సందర్భాలు ఉన్నాయి.కానీ సరైన కథ దొరకక వీరు కలిసి చేయాలనుకున్న చిత్రం వీలుపడలేదు.
అంత పెద్ద బ్యానర్లో రామానాయుడు చిరు కాంబినేషన్లో ఒక్కటంటే ఒక్కటే చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం…. ఆ చిత్రమే ‘సంఘర్షణ అప్పట్లో మంచి విజయం సాధించింది చిత్రం. ఆ తరువాత వీరి కాంబినేషన్ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ ఒక్కటి కూడా వర్క్ అవుట్ కాలేదు.అయితే రామానాయుడు లేనప్పటికీ ఆ సంస్థలో చిరు త్వరలో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం చిరు కోసం బాబి ఒక కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.అన్నీ కుదిరితే చిరుతో బాబీ చేయాలనుకుంటున్న చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ లో రూపుదిద్దుకోనుందని అంటున్నారు.ఇప్పటికే బాబీ ఆ సంస్థలో ‘వెంకీ మామ’చిత్రం చేసి ఉన్నారు.ప్రస్తుతం ఈ విషయమై సురేష్ బాబుతో చర్చలు జరుగుతున్నట్లు టాక్ నడుస్తుంది.