ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ధాటికి అనంతపురం జిల్లా ప్రజలు కూడా బాధితులే. దీని నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నెలలపాటు విధించిన లాక్ డౌన్ సమయంలో ప్రజల జీవనం స్తంభించిపోయింది. పేద, మధ్యతరగతి, వలస కూలీల బ్రతుకు దుర్భరమైన పరిస్థితిలో రూరల్ డాలర్ మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి )ఆపన్న హస్తం అందించింది.
దాదాపుగా 4.12 లక్షల మందికి కడుపు నింపి అన్నపూర్ణగా పేరుగాంచింది.సుమారు రెండు కోట్ల రూపాయల మేర వ్యయం చేసి ఆహారం పంపిణీ చేసింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి శానిటైజర్లను వినియోగించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే 69 ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేసింది.
అంతేకాకుండా కరోనా నివారణకు తనవంతు సాయంగా ప్రభుత్వానికి 3 కోట్ల వరకు విరాళం అందించింది.జిల్లాలోని 63 మండలాలకు గాను ప్రతి మండలానికి లక్ష చొప్పున మాస్కులు పంపిణీ, పిపిఈ కిట్లు, వలస కార్మికులకు రవాణా వ్యయాన్ని చెల్లించింది