వయాగ్రా ఎందుకు వాడతారు ? దాని చరిత్ర తెలుసా ….

వయాగ్రా ఎందుకు వాడతారు ? దాని చరిత్ర తెలుసా

0
126

వయాగ్రా దీని పేరు చెప్పగానే చాలా మంది సిగ్గుపడతారు, అయితే చాలా మందికి అసలు ఇది ఎందుకు వాడతారో తెలియదు. దీని అసలు పేరు సిల్డినాఫిల్ సిట్రేట్.. ప్రపంచ వ్యాప్తంగా పురుషుల్లో అంగస్తంభన లోపాన్ని అధిగమించేందుకు ఇది వాడతారు.

అయితే ఈ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే మానసిక సమస్యలు, శారీరకమైన లోపాలు, హార్మోన్ సమస్యలు, దీర్ఘకాలిక మధుమేహం, రక్తనాళాల సమస్యలు, నాడుల పనితీరు తగ్గటం వంటి ఎన్నో అంశాలు అంగస్తంభన పటుత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక 1999 నుంచి దీని వాడకం బాగా పెరిగింది.

పురుషుల లైంగిక సామర్ధ్యాన్ని తక్షణం, తాత్కాలికంగా పునరుద్ధరించటంలో వయాగ్రా ముఖ్యపాత్ర పోషిస్తోందని పలువురు సెక్సాలజిస్ట్లు చెబుతున్నారు, ఇక చాలా మందికి ఈ సమస్య ఉంది,
అమెరికాలోనే మొత్తం పురుషుల్లో 10 శాతం మందికి ఈ సమస్య ఉందని అంటున్నారు
ఊబకాయం, మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉంటే ఈ సమస్య ఉంటుంది, అయితే వయాగ్రా వాడటం వల్ల పూర్తిగా ఈ సమస్య తొలగిపోదు అంటున్నారు వైద్యులు.