తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ – విద్యార్థులకు గుడ్ న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - విద్యార్థులకు గుడ్ న్యూస్

0
98

ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దివిన త‌ర్వాత ప‌ల్లెల నుంచి గ్రామాల నుంచి టౌన్ కి సిటీకి వెళ్లి చ‌ద‌వాలి అంటే చాలా మంది చ‌దువుకోరు.. ఇక అమ్మాయిల‌ని కూడా చాలా మంది పేరెంట్స్ పంపించ‌రు, అయితే ఇప్పుడు చాలా స్టేట్ లు ఈ డ్రాప‌వుట్స్ త‌గ్గించాలి అని చూస్తున్నాయి.

అయితే తెలంగాణ‌లో కాలేజీల్లో విద్యార్థుల డ్రాపౌట్స్‌ను నియంత్రించడం.. పౌష్టికాహారాన్ని అందించేందుకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు నిర్ణయించారు. ఇది విద్యార్దుల‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక ఉద‌యం కాలేజీకి వ‌చ్చి మ‌ధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోతూ క్లాస్ లకు రానివారు డ్రాప‌వుట్స్ ఉంటున్నారు
ఫలితంగా ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు, ఈ ఏడాది నుంచి ఇది అమ‌లు అవుతుంది. ఇక జూనియ‌ర్ కాలేజీ డిగ్రీ కాలేజీలో చ‌దివే వారికి కూడా భోజ‌నం అందివ్వ‌నున్నారు.