రెమ్యూనరేషన్స్ భారీగా త‌గ్గించుకున్న హీరోయిన్లు

రెమ్యూనరేషన్స్ భారీగా త‌గ్గించుకున్న హీరోయిన్లు

0
139

ఈ క‌రోనా లాక్ డౌన్ వేళ సినిమా షూటింగులుల‌కి బ్రేకులు ప‌డ్డాయి, దాదాపు నాలుగు నెల‌లుగా సినిమాల షూటింగులు లేవు, అంతేకాదు సినిమా విడుద‌ల కూడా లేదు, దీంతో చాలా వ‌ర‌కూ సినిమా ప‌రిశ్రమ దారుణ‌మైన న‌ష్టాలు చూసింది, అంతేకాదు సినిమా ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది అవ‌కాశాలు లేక ఇబ్బంది ప‌డుతున్నారు.

ఈ స‌మ‌యంలో నిర్మాత‌లు కూడా బ‌య‌ట నుంచి న‌గ‌దు తెచ్చి సినిమాలు లేక ఇబ్బంది ప‌డుతున్నారు.
ఇక హీరోయిన్లు కూడా త‌మ‌కు క్రేజ్‌ వున్నప్పుడే పారితోషికం విషయంలో ముక్కుపిండి మరి వసూలు చేస్తారు. కాని ఈ క‌రోనా స‌మ‌యంలో సినిమాలు కొత్త‌వి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియ‌ని ప‌రిస్దితి.

తాజాగా కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌లు తమ రెమ్యూనరేషన్స్‌ విషయంలో కాస్త తగ్గారని తెలిసింది. ఇటీవల సినిమాకి 2 కోట్లు వసూలు చేసిన కాజల్‌ అగర్వాల్‌ చిరంజీవి ఆచార్యకు కోటిన్నర మాత్రమే తీసుకుంటుంది. రకుల్‌ కూడా స‌గానికి స‌గం రెమ్యున‌రేష‌న్ త‌గ్గించారు అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలా చాలా మంది హీరోయిన్లు ఇదే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.