అంగరంగా వైభవంగా అమ్మవారి మహోత్సవం…

అంగరంగా వైభవంగా అమ్మవారి మహోత్సవం...

0
84

అనంతపురం జిల్లా గుత్తి కోటలో ఎంతో వైభవంగా జరగాల్సిన చారిత్రక గుత్తి కోట రేణుకా ఎల్లమ్మ జాతర మహాత్సవాలపై కోవిడ్ ఆంక్షల ప్రభావం పడింది.ఏటా వేలాది మంది భక్తులు పాల్గొనే జాతరకు ఈసారి పరిమితంగా మాత్రమే భక్తులను అనుమతించారు.13 శతాబ్దంలో వెలిసిన ఈ ఆలయంలో అనేక మంది రాజులు, సైన్యాధిపతులు నిత్య పూజలు నిర్వహించే వారని చరిత్ర చెబుతోంది.

ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.కష్టాలను తొలగించే తల్లిగా గుత్తి కోట సంరక్షకురాలిగా పేరుగాంచిన అమ్మవారిని దర్శించుకుంటే సకల అరిష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

జాతర మహోత్సవంలో భాగంగా ఆలయంలో శుక్రవారం ఆయుత చండీ హోమం నిర్వహించారు.పరిమిత సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం పట్టణ వాసులు సామాజిక దూరం పాటిస్తూ ఒక్కొక్కరుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని వెళ్లారు. అమ్మవారి దయతో వచ్చే ఏడాది ఆడంబరంగా పూజలు నిర్వహించుకుంటామని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.