ఆచార్య సినిమాలో చెర్రీకి జోడీ ఎవరు ? నలుగురు హీరోయిన్లా ?

ఆచార్య సినిమాలో చెర్రీకి జోడీ ఎవరు ? నలుగురు హీరోయిన్లా ?

0
92

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా గురించి ఏ అప్ డేట్ వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఇక ఈ చిత్రంలో చెర్రీ కూడా నటిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి, అయితే మెగాస్టార్ ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజుల తర్వాత స్టార్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు టాలీవుడ్ పెద్దలు.

ఇప్పుడు కరోనా ప్రభావంతో ఈ చిత్ర షూటింగ్ నిలిపివేశారు, ఇక ఈ సినిమా తర్వాత లూసిఫర్ తెరకెక్కుతుంది, తర్వాత ఇప్పటి యువ దర్శకులలో ఒకరితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు చిరు, అయితే ఇప్పుడు ఆచార్య సినిమాలో నలుగురు హీరోయిన్లు అంటూ ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

కాజల్ ప్రధాన నాయిక కాగా నటిస్తున్నారు, ఇక సినిమాలో రెజీనా స్పెషల్ నెంబర్ లో నర్తిస్తుంది. ఇందులో స్పెషల్ రోల్ పోషిస్తున్న రామ్ చరణ్ కి నాయికగా కియరా అద్వాణీ నటిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇక మరో పాటలో తమన్నా కూడా నర్తించే ఛాన్స్ ఉంది అంటున్నారు, మరి దీనిపై క్లారిటీ వచ్చేవరకూ ఏమిటి అనేది తెలియదు.