ఓఎల్ఎక్స్ లో అమ్మడం కొనడం చేస్తున్నారా ? ముందు ఈ పని చేయండి

ఓఎల్ఎక్స్ లో అమ్మడం కొనడం చేస్తున్నారా ? ముందు ఈ పని చేయండి

0
96

ఈ రోజుల్లో ఏది అమ్మాలి అన్నా ఏది కొనాలి అన్నా అంతా ఆన్ లైన్ అయింది, అయితే చాలా మంది ఇప్పుడు తమ వస్తువులు అమ్మడానికి సెకండ్ హ్యాండ్ బైక్స్ కార్లు కొనడానికి ఓఎల్ఎక్స్ ని ఎంచుకుంటున్నారు, ప్లాట్ ఫామ్ బాగానే ఉంది, అయితే అందరూ ఒకేలా ఉండరు కదా కొందరు ఘరానా కేటుగాళ్లు ఇందులో ఎంటర్ అయి చాలా మందికి మస్కా కొడుతున్నారు.

బైక్ కొంటానని వచ్చిన ఓ యువకుడు ట్రయల్ వేస్తానని చెప్పి బైక్తో ఉడాయించాడు. ఇలాంటి కేసులు నిత్యం పదుల సంఖ్యలో వస్తున్నాయి, ఇక ఫోన్ నెంబర్లు ఫేక్ ఉంటాయి లాగిన్ ఐడీలు ఫేక్ ఉంటాయి, వారి అడ్రస్ లు ఫేక్ ఉంటాయి.

ఇది చివరకు పోలీసులకు పెద్ద పరీక్ష అవుతోంది, అయితే ఇలాంటి వారు చాలా మంది ముందు ట్రయల్ వేస్తాను అని బైక్ కారు తీసుకుంటారు అయితే మీరు వెనకాలే కూర్చుని ట్రయల్ కు వెళ్లండి కుదరదు అంటే అసలు ఆ వ్యక్తికి అమ్మకండి, ఎందుకు అంటే కుదరదు అన్నవాడు మీ బైక్ దొంగిలించడానికి వచ్చినట్టే లెక్క.

ఇక మీ డాక్యుమెంట్లు అస్సలు వారికి ఇవ్వవద్దు ఫుల్ అమౌంట్ మీ చేతికి వచ్చిన తర్వాత ఇవ్వండి, ఇక ఏదైనా బైక్ కారు అమ్మడానికి వెళితే మీరు కూడా సింగిల్ గా కాదు, మీ బ్రదర్ తండ్రి ఫ్రెండ్ ఎవరిని అయినా ఒకరిని తీసుకువెళ్లండి …కొందరు గ్యాంగ్ ల రూపంలో వచ్చి దాడి చేసి బైక్ తీసుకుపోతున్నారు, ఇవన్నీ ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటున్నారు పోలీసులు .