మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర ఈసారి ఎంత పెరిగిందంటే….

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర ఈసారి ఎంత పెరిగిందంటే....

0
76

ఒకవైపు కరోనా భయం మరో వైపు డీజిల్ బాదుడుతో సామాన్యులు హడలిపోతున్నారు… పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర ఎక్కువ అవుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.. రోజువారి సమీక్షలో భాగంగా పెట్రోల్ ధరలను స్థిరంగా ఉంచిన చయువు సంస్థ డీజిల్ ధరను 12 పైసలు పెంచింది…

దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 81.64 కు చేరింది… పెట్రోల్ ధరలు యధాతథంగా ఉండటంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 80.43 ఉంది… అంటే పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర 1.21 ఎక్కువ…

జూన్ నుంచి వరుసగా 22 రోజులపాటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి… అయితే జూన్ 29 నుంచి పెట్రోల్ ధరను మార్చుకోగా డీజిల్ ధరను మాత్రమే చమురు కంపెనీలు పెంచాయి…