అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా ఇటు సౌత్ ఇండియాలో ఎంతో ఫేమస్ హీరో, అయితే ఆయన చిత్రాలు కూడా అదరహో అన్నట్లు ఉంటాయి, అద్బుతమైన నటన డాన్స్ తో అల్లుఅర్జున్ అదరగొడతారు, తనకు సెట్ అయ్యే పాత్రలు కథలు ఎంచుకోవడంలో బన్నీ సూపర్ అనే చెప్పాలి, టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ గా ఉంటాడు బన్నీ.
అయితే బన్నీ పలు హిట్ కమర్షియల్ చిత్రాలు చేశారు, అంతేకాదు బన్నీ గంగోత్రి సినిమాతో హీరో అయ్యారు, అయితే అంతకుముందు ఆయన కొన్ని చిత్రాల్లో చేశారు, కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసు.. మరి ఆ చిత్రాలు ఏమిటి అనేది బన్నీ అభిమానులకి కూడా కొందరికి తెలియదు.
సో మరి ఆ చిత్రాలు ఏమిటి అనేది చూద్దాం..చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినపుడు అందులో ఓ చిన్నపిల్లవాడి పాత్రలో మొదటి సారిగా నటించాడు బన్నీ.
1985 విజేత బాల నటుడిగా నటించారు బన్నీ ఈ చిత్రంలో
1986 స్వాతిముత్యం బాల నటుడిగా నటించారు బన్నీ ఈ చిత్రంలో
2001 డాడీ అతిథి పాత్రలో నటించారు బన్నీ