బెజవాడ కనకదుర్గమ్మ భక్తుల కోరికలు నెరవేర్చే మహాతల్లిగా ఆమెని కొలుస్తారు, అమ్మవారి ఆశీస్సులు కృప కోసం నిత్యం భక్తులు వేల మంది అక్కడకు చేరుకుంటారు..స్త్రీ శక్తి పీఠాలలో ఒకటిగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ప్రసిద్ది చెందింది.. అయితే అమ్మవారికి చాలా మంది మొక్కులు మొక్కుకుంటారు.
మరి దసరా నవరాత్రి మహొత్సవాల్లో ఒక్కోరోజు ఒక్కో అవతారంలో అమ్మవారి అలంకరణ ఉంటుంది ఉదయం నుంచి రాత్రి వరకూ దర్శకం కలిగిస్తారు భక్తులకి, ఈ సమయంలో భవాణీ మాలదరణ కూడా జరుగుతుంది.. నవరాత్రి రోజుల్లో అమ్మవారి అలంకరణాలు.
మొదటి రోజు బాల త్రిపురసుందరి దేవి
రెండవ రోజు గాయత్రి దేవి
మూడవ రోజు అన్నపూర్ణా దేవి
నాలుగవ రోజు లలితా త్రిపురసుందరి
ఐదవ రోజు సరస్వతి దేవిగా
ఆరవ రోజు దుర్గాదేవి
ఎడవ రోజు మహాలక్ష్మిదేవి
ఎనిమిదవ రోజు మహిషాసురమర్దినిదేవి
తొమ్మిదవ రోజు రాజరాజేశ్వారిదేవి