రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినేట్ లో పలాస నియోజకవర్గం యువ శాసనసభ్యుడు డాక్టర్ సీదిరి అప్పలరాజుకు అవకాశం దక్కింది… పలాసా నియోజకవర్గం నుంచి తొలిసారి మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించనున్న వ్యక్తిగా ఎమ్మెల్యేగా సీదిరి అప్పలరాజు చరిత్ర సృష్టించారు..
వజ్రపుకొత్తురు మండలం దేవునల్లాడ గ్రామంలో సామన్య మత్స్యకార కుటుంబంలో జన్మించిన సీదిరి అప్పలరాజు వైద్య విద్య పూర్తి చేశాడు… వైద్య వృత్తిలో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు..పలాసలో దశాబ్దకాలానికి పైగా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించి మంచి హస్తవాసి గల వైద్యునిగా పేరు తెచ్చుకున్నారు…
2017 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఆయన వైసీపీ తీర్థం తీసుకున్నారు… ఒకవైపు నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ మరో వైపు ప్రజా సమస్యలపైనిరంతరం పోరాటం చేసేవారు..ఇక ఆయన కష్టాన్ని గుర్తించిన జగన్ 2019లో వైసీపీ తరపున పోటీకి దింపారు దశాబ్దాలకాలం పాటు రాజకీయ చరిత్ర ఉన్న గౌతు కుటుంబాన్ని ఓడించారు… ఇప్పుడు జగన్ కేబినేట్ లో అవకాశం దక్కించుకున్నారు…