హీరోలు ఈ లాక్ డౌన్ సమయంలో దాదాపు నాలుగు నెలలుగా ఇంటి పట్టున ఉంటున్నారు, అయితే ఈ సమయంలో పలు కథలు కూడా వింటున్నారు, యువ దర్శకులు చెబుతున్న కధలు నచ్చి కొందరు ఈ హీరోలు చిత్రాలు లాక్ చేస్తున్నారు.. మరికొందరు ఈ కధలలో కాస్త మార్పులు కావాలి అని కోరుతున్నారు.
సో మెగా హీరోలు కూడా ఇదే వరుసలో ఉన్నారు బన్నీ చిరంజీవి పవన్ కల్యాణ్ కూడా కొత్త కధలు వింటున్నారు, ఇక తాజాగా రామ్ చరణ్ కూడా దర్శకులకి ఛాన్స్ ఇస్తున్నారు…చెర్రీ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్నిచేస్తున్నారు, ఇక మరి కొన్ని నెలలు సమయం పట్టేలా ఉంది ఈ చిత్రం పూర్తి అవ్వడానికి.
కొరటాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య’ చిత్రంలో కూడా ప్రత్యేక పాత్రను చరణ్ పోషించాల్సివుంది. ఇక తర్వాత చిత్రం ఏమిటి అనేదానిపై ఇంకా ఏ విషయం బయటకు రాలేదు, తాజాగా చలో- భీష్మ చిత్రాలతో సక్సెస్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చిందని తెలుస్తోంది, అందుకే ఆయనతో సినిమాకి ఒకే చెప్పారట, అంతేకాదు ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తారని తెలుస్తోంది…సో దీని గురించి పూర్తిగా ప్రకటన రావాల్సి ఉంది.