నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి చిత్రం హీరోయిన్ కీర్తి సురేష్ కు ఎంతో ఫేమ్ తీసుకువచ్చింది, అంతేకాదు ఆమెకి అనేక అవార్డులు వచ్చాయి, అయితే ఆమెకి అవకాశాలు కూడా అలాంటివి వస్తున్నాయి, పలు అగ్రహీరోలతో ఇప్పుడు ఆమెకి అవకాశాలు వస్తున్నాయి.
ఇప్పటికే విజయ్, విక్రమ్, సూర్య, పవన్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన కీర్తి తాజాగా రజనీకాంత్ సరసన అన్నాత్తేచిత్రంలో నటిస్తోంది. ఇక సర్కారువారి పాట సినిమాలో మహేష్ సరసన ఆమె నటిస్తోంది.
ఈ సమయంలో కీర్తి మరో అగ్రకథానాయకుడు కమల్హాసన్ సరసన కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2006లో విడుదలైన రాఘవన్ చిత్రానికి సీక్వెల్గా రూపొందబోయే సినిమాలో కమల్ సరసన కీర్తి నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో లోకనాయకుడి తో ఆమె నటించనున్నారు అని వార్తలు వస్తున్నాయి, ఇక సెట్స్ పై ఇప్పటికే కీర్తికి మూడు సినిమాలు ఉన్నాయి.