కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ జెనీలియా

కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ జెనీలియా

0
94

ఈ మధ్య సినిమా సెలెబ్రెటీలు సినిమాలతో పాటు ఇటు సినిమా నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు, అంతేకాదు చిత్రాలకు నిర్మాతలుగా మారుతున్నారు, అలాగే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు, అలాగే పలు రకాల వ్యాపారాలు ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ బాటలోకి తెలుగు హీరోయిన్ఎంట్రీ ఇస్తోంది, అనేక సినిమాల్లో నటించి మెప్పించిన స్టార్ హీరోయిన్ జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకొని ముంబైలో సెటిల్ అయ్యింది. ఇటు సినీ రాజకీయ కుటుంబం రితేష్ ది, అయితే ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది ఈ భామ.

ఇక ఆ కుటుంబం మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు నాలుగు సంవత్సరాలుగా, ఇక ఫ్యూచర్ లో కూడా తినము అంటున్నారు..వీరు వినూత్నంగా ఆలోచించారు..రుచిలోనూ, వాసనలోనూ, పోషక పదార్ధాల్లోనూ మాంసాన్ని తలపించేలా కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొక్కలతో తయారయ్యే ఆహారాన్ని ఇండియాలో ఉత్పత్తి చేయాలని జెనీలియా దంపతులు భావించారు.

అమెరికాకు చెందిన ఆర్చర్ డేనియల్స్ మిడ్ ల్యాండ్ గుడ్ పుడ్స్ ఇనిస్టిట్యూట్ తో కలిసి జెనీలియా దంపతులు ఇమేజిన్ మీట్ పేరుతో ఇండియాలో బిజినెస్ ను లాంచ్ చేయబోతున్నారు, సో కొత్త బిజినెస్ లోకి ఈ జంట ఎంట్రీ ఇస్తోంది.