క్లినికల్ ట్రయల్స్ ఈ కరోనా సమయంలో బాగా వినిపిస్తున్న మాట, ఫార్మా కంపెనీలు ముఖ్యంగా ఏదైనా వ్యాక్సిన్ తయారు చేసే సమయంలో అది ఎలా పని చేస్తుంది, అది ఎంత వరకూ మంచిది అని తెలుసుకోవడానికి ఈ క్లినికల్ ట్రయల్స్ చేస్తారు, అయితే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం.
వ్యాక్సిన్ అనేది నాలుగు దశల్లో ఉంటుంది. మొదట కనిపెట్టిన మందును జంతువులపై ప్రీ క్లినికల్ టెస్టింగ్ లు నిర్వహిస్తారు. ముందు కోతులు ఎలుకలు చింపాజీలలో పరీక్షలు చేస్తారు, ఆ తర్వాత అది బాగా సత్పలితాలు ఇస్తే..
ఫేజ్ 1లో కొద్దిమంది మనుషులపై పరీక్షిస్తారు. వారి ఆరోగ్యం వైరస్ ను ఎదుర్కొనడానికి టీకా ఎలా పని చేస్తుందో అధ్యయనం చేస్తారు. ఇది విజయవంతమైతే ఫేజ్ 2కు వెళ్తారు, ఇక్కడ వందల సంఖ్యల్లో మనుషులపై ప్రయోగం జరుపుతారు.
ఇక్కడ సక్సెస్ అయితే ఫేజ్ 3లో వేలాది మందిపై టీకాలను ప్రయోగిస్తారు. అన్ని టెస్టుల్లో విజయవంతమైతే అప్పుడు దీనికి ఆయా దేశాల్లో వైద్యమండలి అప్రూవల్ ఇస్తుంది, అయితే ఇది చిన్నపిల్లలు పెద్దలు నడివయస్కులు మధ్య వయస్కులు వృద్దులు ఇలా అందరిపై ప్రయోగిస్తారు, ఇక ఆ డేటా పూర్తిగా భద్రపరుచుకోవాలి, ఆ డేటా అంతా వైద్య మండలికి ఇవ్వాలి, అవన్నీ పరిశీలించి వాటికి అప్రూవల్ ఇస్తారు.