ఏపీలో కరోనా వైరస్ తన కొరలు చాచుతోంది… గత వారం రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండటంతో జనం భాయందోళనకు గురి అవుతున్నారు… తాజాగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
అయితే అనుమానంతో ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు చేయగా ఆ ఉద్యోగి కుటుంబంలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఉద్యోగికి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కి కరోనా వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ముందస్తు జాగ్రత్తగా కొడవలూరు తహశీల్దార్ రెవెన్యూ సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేయించి తహసీల్దార్ కార్యాలయాన్ని మూసివేశారు…