ఆల్ టైం హై భారీగా పెరిగిన బంగారం ధ‌ర – వెండి రికార్డ్ బ్రేక్

ఆల్ టైం హై భారీగా పెరిగిన బంగారం ధ‌ర - వెండి రికార్డ్ బ్రేక్

0
85

బంగారం ధ‌ర‌లు దూసుకుపోతున్నాయి, ఆకాశాన్ని తాకుతున్నాయి, ధ‌ర‌లు ఎక్క‌డ చూసినా గోల్డ్ ర‌ష్ త‌గ్గడం లేదు, మార్కెట్లో గ్రాముకి 20 లేదా 30 నుంచి ఏకంగా 70 వ‌ర‌కూ పెరుగుతోంది, గ‌డిచిన రెండు రోజులుగా బంగారం రేటు పెరుగుతూనే ఉంది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగింది…దీంతో ధర రూ.52,500కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరుగుదలతో రూ.48,150కు చేరింది.

ఇక బంగారం ఇలా ఉంటే వెండి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి లోను చేస్తూ దారుణంగా పెరుగుతోంది,కేజీ వెండి ధర ఏకంగా రూ.3050 పెరిగింది. దీంతో ధర రూ.62,000కు చేరింది, వెండిధ‌ర ఆల్ టైం హైకి చేరింది అని చెప్పాలి, శ్రావ‌ణ శుక్ర‌వారానికి బంగారం ధ‌ర మ‌రింత పెరుగుతుంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.